నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని || niggadeesi adugu e sigguleni jananni lyrics

ante_enti_fallback_image

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని || niggadeesi adugu e sigguleni jananni lyrics

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ

error: Content is protected !!