అభినవ తారవో.. నా అభిమాన తారవో || abhinava taravo.. naa abhiman taravo lyrics

ante_enti_fallback_image

అభినవ తారవో.. నా అభిమాన తారవో || abhinava taravo.. naa abhiman taravo lyrics

అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..

అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కంతిధారవో
మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ
శివరంజనీ.. శివరంజనీ

అది దరహాసమా మరి మధురమాసమా
అది దరహాసమా మరి మధురమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా

అవి చరణమ్ములా శశికిరణమ్ములా
అవి చరణమ్ములా శశికిరణమ్ములా
నా తరుణభావనా హరిణమ్ములా

అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..
శివరంజనీ.. శివరంజనీ

ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలూ విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడినచాలు
ఆ నెన్నడుమూ ఆడినచాలు రవళించునూ పదకవితా ప్రభందాలు

అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..
శివరంజనీ.. శివరంజనీ

నీ శ్రుంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైనా
నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కసులైనా

వీరమా.. నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా.. నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ
నటనాంకింత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ..మిన్నులందుకున్నవాడ
ఆ .. నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను..
నీ ప్రియభక్తుడనూ

అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..
శివరంజనీ.. శివరంజనీ

error: Content is protected !!