అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ || adigo adigo badragiri.. andhrajathikidi ayodhyapuri lyrics

ante_enti_fallback_image

అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ || adigo adigo badragiri.. andhrajathikidi ayodhyapuri lyrics

ఓం .. ఓం .. ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః !
అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
ఏ వాల్మీకీ రాయని కధగా..సీతారాములు తనపై ఒదగా
రామదాసకౄత రామపదామౄత వాగ్గేయస్వర సంపదగావెలసిన దక్షిణ సాకేతపురీ..
అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
రాం .. రాం .. రాం .. రాం
రామనామ జీవన నిర్మిత్రుడు పునః దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడూ
తపమును మెచ్చీ ధరణికి వచ్చీ దర్శనమిచ్చెను మహావిష్ణువూ
త్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడూ

ధరణిపతియే ధరకు అల్లుడై..
శంఖచక్రములు అటు ఇటు కాగా..
ధనుర్బాణములు తనువై పోగా..
సీతాలక్ష్మణ సమితుడై..
కొలువు తీరె కొండంత దేవుడూ..

శిలగా మళ్ళీ మలచీ..
శిరమును నీవే నిలచీ..
భద్రగిరిగ నను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ

వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాత పత్ర నయనంభద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతింసౌమిత్రి యుక్తం భజే !

అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ

error: Content is protected !!