అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే || andanike addanive kattunna bottunna godarive lyrics

ante_enti_fallback_image

అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే || andanike addanive kattunna bottunna godarive lyrics

గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి (2)
పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మాడి
పుత్తడి వెలుగులు హ్మ్మ్ మ్మ్హొ ఓ లచ్చా గుమ్మాడి

అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే
అమ్మాయికే అర్ధానివే మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉంది
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ

చరణం 1
నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ
నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ
ఒక్కట్టయేందుకే ఇద్దరం ఉన్నదీ
నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవి
నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నవి

చరణం 2
వెల వెల వెల వెల ఉప్పెన నేనై వస్తా
నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా
గల గల గల గల మువ్వని నేనై వస్తా
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లొ చోటున్నది
నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉంది
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ

error: Content is protected !!