భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా || bharathavedamuga niratha natyamuga kadilin padmidi eesha lyrics

ante_enti_fallback_image

భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా || bharathavedamuga niratha natyamuga kadilin padmidi eesha lyrics

శంభోశంకరా !
హర హర మహాదేవ..హర హర మహాదేవ !
హర హర మహాదేవ..హర హర మహాదేవ !

తద్దిన్ దా ధిమి ధిన్ ధిమి పదుల తాండవకేళీ తర్పరా !
గౌరీ మంజుల సింజినీ..జతుల లాస్యవినోదవ శంకరా !

భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా..
శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా..
నీలకంధరా జాలిపొందరా..కరుణతో నను గనరా..
నీలకంధరా శైలమందిరా..మొరవిని బదులిడరా..
నగజా మనోజ జగదీశ్వరా..పాలేందు శేఖరా..శంకరా !

భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా..
శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా..

హర హర మహాదేవ..హర హర మహాదేవ !
హర హర మహాదేవ..హర హర మహాదేవ !

ఆ .. ఆ .. ఆ .. ఆ.. ఆ .. ఆ .. ఆ .. ఆ..
హా.. అంతకాంత నీ సతి..అగ్నితప్తమైనదీ..
మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ..
ఆదిశక్తి ఆకౄతీ..అత్రిజాత పార్వతీ..స్థాణువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నదీ..
ఆ .. ఆ .. ఆ .. ఆ..
ఆ .. ఆ .. ఆ .. ఆ..
భవుని భువికి తరలించేలా..తరలి విధిని తలపించేలా..
రసతరంగిణీ లీలా యతిని రక్తుని చేయగలిగే ఈ.. వేళా !

భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా..
శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా..

జంగమసావర గంగార్చిత శిర మౄద మండిత కర పుర హరా !
రక్తశుభంకర భవనాశంకర స్వర హర దక్షా త్వర హరా !!
ఫాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వరా !
ఆశుతోష అధ నాశవినాశన జయగిరీశ బౄహదీశ్వరా !!

హర హర మహాదేవ..హర హర మహాదేవ !

వ్యోమకేశ నిను హిమగిరి వర సుత ప్రేమ పాశమున పిలువంగా..
యోగివేశ నీ మనసున కల కద రాగలేశమైనా..
హే మహేశ నీ భయదపదాహుతి దైత్యశోషణము జరుపంగా..
భోగిభూశ భువనాళిని నిలుపగ అభయముద్రలోనా..
నమక చమకముల నాదానా..యమక గమకముల యోగానా..
పలుకుతున్న ప్రాణానా..ప్రణవనాధ..ప్రధమనాధ శౄతి వినవా..

హర హర మహాదేవ !

error: Content is protected !!