బుగ్గే బంగారమా..సిగ్గే సింగారమా || bugge bangarama.. sigge singarama lyrics

ante_enti_fallback_image

బుగ్గే బంగారమా..సిగ్గే సింగారమా || bugge bangarama.. sigge singarama lyrics

పచ్చిపాలా..యవ్వనాలా..గువ్వలాటా..పంచుకుంటే రాతిరంతా జాతరంట..
లేలలా..లాలాలాలా..లేలలా..లాలాలాలా..
లాలరలల్లా..లాలరలల్లా..లలల..లలల..లా..లలలా..

బుగ్గే బంగారమా..సిగ్గే సింగారమా..అగ్గే రాజేసెలేమ్మా..
ఒళ్ళే వయ్యారమా..నవ్వే మందారమా..నన్నే కాజేసెనమ్మా..
పట్టు చీరల్లో చందమమా..ఏడు వన్నెల్లొ..వెన్నెలమ్మా..
కన్నె రూపాన కోనసీమా..కోటి తారల్లొ ముద్దుగుమ్మా..

బుగ్గే బంగారమా..సిగ్గే సింగారమా..అగ్గే రాజేసెలేమ్మా..
ఒళ్ళే వయ్యారమా..నవ్వే మందారమా..నన్నే కాజేసెనమ్మా..

ఏలొ..ఏలొ..ఏలొ..ఏలేలో..
ఏలొ..ఏలొ..ఏలొ..ఏలేలో..

ఎదురే నిలిచే అధర మధుర దరహాసం..ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం..
వెలిగే అందం ..చెలికే స్వంతం ..వసంతం..
వరమై దొరికే అసలు సిసలు అపురూపం ..కలిసే వరకూ కలలో జరిగే..విహారం..
పుష్యమాసాన మంచు నీవో..భొగి మంటల్లొ వేడి నీవొ..
పూల గంధాల గాలి నీ..వో..పాలనురగల్లొ తీపి నీవో..

బుగ్గే బంగారమా..సిగ్గే సింగారమా..అగ్గే రాజేసెలేమ్మా..

Here we goo..
నాగమల్లి పూలతోనె నంజుకున్న ముద్దులాల..సందెగాలి కొట్టగానె ఆరుబైట ఎన్నెలింట..సర్దుకున్న కన్నె జంట సద్దులాయెరో.. Yoo..
నారుమల్లె తోట కాడ నాయుడోరి ఎంకి పాట..నాగమల్లి పూలతోనె నంజుకున్న ముద్దులాల..సందెగాలి కొట్టగానె ఆరుబైట ఎన్నెలింట..సర్దుకున్న కన్నె జంట సద్దులాయెరో..

ఎదలో జరిగే విరహ సెగల వనవాసం.. బదులే అడిగే మొదటి వలపు అభిషేకం..
వధువై..బిడియం..ఒదిగే..సమయం.. ఎపుడో..ఓ..
జతగా పిలిచే అగరు పొగల సహవాసం..జడలో..జగడం..జరిగే..సరసం..ఎపుడో..ఓ..
అన్ని పూవుల్లో..ఆమె నవ్వే..అన్ని రంగుల్లో..ఆమె రూపే..
అన్ని వేళల్లొ..ఆమె ధ్యాసే..నన్ను మొత్తంగా మాయచేసే..

బుగ్గే బంగారమా..సిగ్గే సింగారమా..అగ్గే రాజేసెలేమ్మా..
ఒళ్ళే వయ్యారమా..నవ్వే మందారమా..నన్నే కాజేసెనమ్మా..
పట్టు చీరల్లో చందమమా..ఏడు వన్నెల్లొ..వెన్నెలమ్మా..
కన్నె రూపాన కోనసీమా..కోటి తారల్లొ ముద్దుగుమ్మా..

error: Content is protected !!