ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది || edo asha edalo modalainadi epudu jada lenidi lyrics

ante_enti_fallback_image

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది || edo asha edalo modalainadi epudu jada lenidi lyrics

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది
ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది నిశీధిలో ఉషోదయంలా

నీ లాలిని పాడే లాలన నేనోయ్
జాబిలికై ఆశ పడే బాలను నేను
తల్లిగా జోకొట్టి చలువే పంచాలోయ్
చెల్లిగా చేపట్టి చనువే పంచాలోయ్
సరిగా నాకే ఇంకా తేలని ఈవేళ

నీ నీలి కనుల్లో వెతుకుతు ఉన్నా
క్షణానికో రూపంలో కనబడుతున్నా
జాడవై నావెంట నిను నడిపించాలోయ్
జానకై జన్మంతా జంటగా నడవాలోయ్
తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీల

error: Content is protected !!