నీల గగన…ధలవి చలన…ధరని జాత్రీ రమణ || neela gagana… dhalavi chalana… dharani jaatri ramana lyrics

ante_enti_fallback_image

నీల గగన…ధలవి చలన…ధరని జాత్రీ రమణ || neela gagana… dhalavi chalana… dharani jaatri ramana lyrics

నీల గగన…ధలవి చలన…ధరని జాత్రీ రమణ
ఆ అ ఆ అ అ అ ఆ
మధుర వదన…నళిన నయన…మనవి వినరా రామ

రామ చక్కని సీతకి…అరచేత గోరింత
ఇంత చక్కని చుక్కకి…ఇంకెవరు మొగుడంట

ఉడత వీపున వేలు విడిచిన…పుడమి అల్లుడు రాముడె

ఎడమ చేతను శివుని విల్లును…ఎత్తిన ఆ రాముడె
ఎత్తగలడ సీత జడను తాళి కట్టె వేళలో

రామ చక్కని సీతకి…

ఎర్ర జాబిలి చెయ్యి గిల్లె…రాముడేడని అడుగుతుంటె
చూడలేదని పెదవి చెప్పె…చెప్పలేమని కనులు చెప్పె
నల్ల పూసై నాడు దేముడు…నల్లని రఘురాముడే

రామ చక్కని సీతకి…

చుక్కనడిగా దిక్కునడిగా…చమ్మ గిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన…నీటి తెరలే అడ్డు నిలిచె
చూపుకోమని మనసు తెలిపె…మనసు మాటలు కాదుగ

రామ చక్కని సీతకి…అరచేత గోరింత
ఇంత చక్కని చుక్కకి…ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి…

ఇందువదన కొందలదన…మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంతమదన ప్రేమ

error: Content is protected !!