గుర్తుకొస్తున్నాయి || gurthukostunnaayi lyrics

ante_enti_fallback_image

గుర్తుకొస్తున్నాయి || gurthukostunnaayi lyrics

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యెదలొతులో యేమూలనో
నిదురించు ఙ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమంతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

చరణం 1
మొదట చూసిన tooring cinema
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పండ్లకై చేసిన కుస్తి
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలొ బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగ చాటుగా కాల్చిన బీడీ
సుబ్బు గాడిపై చెప్పిన చాడి
మోతు బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం

చరణం 2
మొదటి సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చి వేయించిన నాన్న
పంచుకున్న ఆ pipperment
పీరు సాయబు పూసిన scent
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తీయందనము

error: Content is protected !!