జోరు మీదున్నావు తుమ్మెదా || joru midunnavu tummeda lyrics

ante_enti_fallback_image

జోరు మీదున్నావు తుమ్మెదా || joru midunnavu tummeda lyrics

జోరు మీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరి కోసమే తుమ్మెదా?
జోరు మీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరి కోసమే తుమ్మెదా?
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ వొల్లు జాగరతె తుమ్మెదా!
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ వొల్లు జాగరతె తుమ్మెదా!
జోరు మీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరి కోసమే తుమ్మెదా?

ముస్తాబు అయ్యావు తుమ్మెదా
కస్తూరి రాశావు తుమ్మెదా
మసక యెన్నెల్లోన తుమ్మెదా
మల్లె పందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా
ఆ మాలెవరికోసమే తుమ్మెదా?

జోరు మీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరి కోసమే తుమ్మెదా?

మెత్తన్ని పరుపూలు తుమ్మెదా
గుత్తంగ కుట్టావు తుమ్మెదా
వత్తైన పరుపుపై తుమ్మెదా
అత్తర్లు చల్లావు తుమ్మెదా
పక్క వేసుంచావు తుమ్మెదా
ఆ పక్కెవరికోసమే తుమ్మెదా?

జోరు మీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరి కోసమే తుమ్మెదా?
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ వొల్లు జాగరతె తుమ్మెదా!
జోరు మీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరి కోసమే తుమ్మెదా?

error: Content is protected !!