Lingashtakam – లింగాష్టకం – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

లింగాష్టకంబ్రహ్మమురారిసురార్చిత లింగం నిర్మలభాసితశోభిత లింగమ్ | జన్మజదుఃఖవినాశక లింగం తత్ప్రణమామి సదా శివ లింగమ్ || 1 ||
అర్థం – ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమను శోభతో కూడి యున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. దేవమునిప్రవరార్చిత లింగం కామదహం కరుణాకర లింగమ్ | రావణదర్పవినాశన లింగం తత్ప్రణమామి సదా శివ లింగమ్ || 2 ||
అర్థం – ఏ లింగమును దేవతలయొక్క ఋషులయొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగియున్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. సర్వసుగంధసులేపిత లింగం బుద్ధివివర్ధనకారణ లింగమ్ | సిద్ధసురాసురవందిత లింగం తత్ప్రణమామి సదా శివ లింగమ్ || 3 ||
అర్థం – ఏ లింగము అన్నిరకముల సుగంధములచే అద్దబడియున్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై యున్నదో, ఏ లింగము సిద్ధులు, దేవతలు, అసురుల చే వందనము చేయబడుచున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. కనకమహామణిభూషిత లింగం ఫణిపతివేష్టితశోభిత లింగమ్ | దక్షసుయజ్ఞవినాశన లింగం తత్ప్రణమామి సదా శివ లింగమ్ || 4 ||
అర్థం – ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడియున్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి యున్నదో, ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. కుంకుమచందనలేపిత లింగం పంకజహారసుశోభిత లింగమ్ | సంచితపాపవినాశన లింగం తత్ప్రణమామి సదా శివ లింగమ్ || 5 ||
అర్థం – ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి యున్నదో, ఏ లింగము తామరపువ్వుల హారముతో అలంకరింపబడియున్నదో, ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. దేవగణార్చితసేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగమ్ | దినకరకోటిప్రభాకర లింగం తత్ప్రణమామి సదా శివ లింగమ్ || 6 ||
అర్థం – ఏ లింగమును దేవగణములచే భావముతో, భక్తితో పూజింపబడుచూ సేవింపబడుచూ ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవకారణ లింగమ్ | అష్టదరిద్రవినాశన లింగం తత్ప్రణమామి సదా శివ లింగమ్ || 7 ||
అర్థం – ఏ లింగము ఎనిమిది (బిల్వ) దళములను చుట్టూ కలిగియున్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై యున్నదో, ఏ లింగము ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో , అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. సురగురుసురవరపూజిత లింగం సురవనపుష్పసదార్చిత లింగమ్ | పరాత్పరం పరమాత్మక లింగం [** పరమపదం **] తత్ప్రణమామి సదా శివ లింగమ్ || 8 ||
అర్థం – ఏ లింగము సురులయొక్క గురువు (బృహస్పతి) మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చనచేయబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైనదానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో యున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ | శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే || అర్థం – లింగాష్టకమను ఈ పుణ్యప్రదమైన ఎనిమిది శ్లోకములను శివుని దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు. (ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది)

[download id=”400051″]

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!