నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది || naa chupe ninu vethikinadi nee vaipe nanu tariminadi lyrics

ante_enti_fallback_image

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది || naa chupe ninu vethikinadi nee vaipe nanu tariminadi lyrics

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది
నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది
నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు
నీకే నీకే చెప్పాలి అంటున్నది

నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం
నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం
గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే
వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే

పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం
అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం
దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటే
పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే

error: Content is protected !!