నువ్వంటే ప్రాణమని || nuvvante pranamani lyrics

ante_enti_fallback_image

నువ్వంటే ప్రాణమని || nuvvante pranamani lyrics

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప

చరణం 1
మనసూ ఉంది మమత ఉంది
పంచుకొనే నువ్వు తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది
ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప
చివరికి ఏమవాలి మన్ను తప్ప

చరణం 2
వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు
జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు
బరువై మెడకు వురివై పొయావు
దేవత లోను ద్రొహం ఉందని తెలిపావు
దీపం కూడా దహి ఇస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
ఎవరిని నిందించాలి నిన్ను తప్ప

error: Content is protected !!