పదహారేళ్ళకూ నీలో నాలో || padaharellaku neelo nalo lyrics

ante_enti_fallback_image

పదహారేళ్ళకూ నీలో నాలో || padaharellaku neelo nalo lyrics

పదహారేళ్ళకూ నీలో నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

పదహారేళ్ళకూ నీలో నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లే విరియ బూసి
వెల్లువల్లే ఉరకలేసే

పదహారేళ్ళకూ నీలో నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరు గాలులకు
తెరచాటొసగిన చెలులు శిలలకూ
తెరచాటొసగిన చెలులు శిలలకూ
దీవెన జల్లులు చల్లిన అలలకూ
కోటి దండాలు శతకోటి దండాలు

నాతో కలిసీ నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే నా పెదవులకు
నీకై చిక్కిన నా నడుమునకూ
కోటి దండాలు శతకోటి దండాలు

భ్రమలో లేపిన తొలి ఝాములకు
సమయం కుదిరిన సందె వెళలకు
నిన్నూ నన్నూ కన్న వాళ్ళకూ
నిన్నూ నన్నూ కన్న వాళ్ళకూ
మనకై వేచే ముందు నాళ్ళకూ
కోటి దండాలు శతకోటి దండాలు

error: Content is protected !!