పారాహుషార్… పారాహుషార్… || Parahushar…Parahushar… lyrics

ante_enti_fallback_image

పారాహుషార్… పారాహుషార్… || Parahushar…Parahushar… lyrics

ఒహొ అహ లాలలా అ అహాహ ఆ,,,
పారాహుషార్… పారాహుషార్…
పారాహుషార్… పారాహుషార్…
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ…
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ…
పారాహుషార్… పారాహుషార్…
అంబారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు…
అంబారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు…
ఊరేగుతు వచ్చేనమ్మ పారాహుషార్…
పారాహుషార్… పారాహుషార్…
తుంటరికన్నయ్య వీడు ఆగడాల అల్లరిచూడు..
తూరుపమ్మ పారాహుషార్..
దుందుడుకుదుండగీడు దిక్కుతోచనీడు..
దక్షిణమ్మ పారాహుషార్..
పాలు పెరుగు ఉండనీడు పోకిరిగోపయ్య చూడు..
పడమరమ్మ పారాహుషార్..
జిత్తులెన్నో వేస్తాడమ్మ..
జిత్తులెన్నో వేస్తాడమ్మ దుత్తలు పడదోస్తాడమ్మ..
ఉత్తరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్..
పారాహుషార్… పారాహుషార్…

రేయిరంగు లేనివాడు వేయినామాలవాడు..
తూరుపమ్మ పారాహుషార్..
ఏమూలన నక్కినాడో ఆనవాలుచిక్కనీడు..

దక్షిణమ్మ పారాహుషార్..
ఓ ఓ ఓ ఓ ఓ హో హొ..
నోరార రా రా రారా అన్నా మొరాయించుతున్నాడమ్మా ఆ పడమరమ్మ పారాహుషార్..
ముక్కుతాడు కోసెయ్యాలి ముట్టెపొగరు తీసెయ్యలి..
ముతీసెయ్యలి..
ఉత్తరమ్మ పారాహుషార్..
పారాహుషార్… పారాహుషార్…

నీలాటిరేవుకాడ నీలమేఘశ్యాముడు చూడ..
అమ్మో ఓయమ్మో..
నీలాటిరేవుకాడ నీలమేఘశ్యాముడు చూడ..
సల్లనైన ఏటినీరు సలసలమరిగిందమ్మ..
అమ్మో ఓయమ్మ..
సెట్టుదిగని సిన్నోడమ్మ బెట్టువదలకున్నాడమ్మ..
సెట్టుదిగని సిన్నోడమ్మ బెట్టువదలకున్నాడమ్మ..
అమ్మమో ఓయమ్మ..
జట్టు కట్ట రమ్మంటుంటే పట్టుదొరకక ఉన్నాడమ్మ..
అమ్మో ఓయమ్మ అమ్మమో ఓయమ్మ..

తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ..
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ..
పారాహుషార్… పారాహుషార్…
పారాహుషార్… పారాహుషార్…

error: Content is protected !!