రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే || ralipoye puvva neeku ragalenduke lyrics

ante_enti_fallback_image

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే || ralipoye puvva neeku ragalenduke lyrics

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా కలికి మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం
||రాలిపోయే||

చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై
||రాలిపోయే||

అనుభంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడి పోయే
తన రంగు మార్చింది రక్తమె తనతొ రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలె ఆకాశము నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై
||రాలిపోయే||

error: Content is protected !!