సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో || satyam emito swapnam emito lyrics

ante_enti_fallback_image

సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో || satyam emito swapnam emito lyrics

సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చేప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా
నిను నీవే సరిగా కనలేదే మనసా
నడి రాతిరి నడక కడతేరదు తెలుసా
ఏవో ఙాపకాల సుడి దాటి బయటపడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా

చంద్రుడి యదలో మంటని వెన్నెల అనుకుంటారనీ
నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసీ
జాబిలినీ వెలివేస్తామా తనతో చెలిమే విడిచీ
రూపం లేదు కనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికి పైన అనుమానపడరు ఎపుడైనా
నిను నీవే సరిగా కనలేవే మనసా..
నడి రాతిరి నడక కడతేరదు తెలుసా….

పోయింది వెతికే వేదన పొందింది ఏదో పోల్చునా
సంద్రం లో ఎగిసే అలకీ అలజడి నిలిచేదెపుడో
సందేహం కలిగిన మదికీ కలతను తీర్చేదెవరో
శాపం లాగ వెంటపడుతున్న గతం ఏదైనా
దీపం లాగ తగిన దారేదో చూపగలిగేనా……

error: Content is protected !!