తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం || taralirada tane vasantam tana dariki rani vanalakosam lyrics

ante_enti_fallback_image

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం || taralirada tane vasantam tana dariki rani vanalakosam lyrics

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
గగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలి||

వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందునుకాదా
ప్రతి మదినిలేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవి సొంతం కోసం కాదను సందేశం
మంచనే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద

తరలి||

బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా
బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా
ఏ కళకైన ఏ కలకైన జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోటే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద

తరలి||

error: Content is protected !!