తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు || tolisari mimmalni chusindi modalu lyrics

ante_enti_fallback_image

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు || tolisari mimmalni chusindi modalu lyrics

శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా
త్రియానంద భోజా
మీ శ్రీచరణాంభుజములకు
ప్రేమతో నమస్కరించి
మిము వరించి
మీ గురించి
ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ
భయముతో భక్తితో అనురక్తితో
చాయంగల విన్నపములూ

సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు
ఎన్నెనెన్నొ కధలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో

నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహు
ప్రేమ లేఖ

ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరు
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి

తలలోన తురుముకున్న తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే
ఆహ్ అబ్బా
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే
ఆహ్ ఆహ్
మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి
ఇప్పుడే బదులివ్వండి

error: Content is protected !!