వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా || vache vache nalla mabbullara lyrics

ante_enti_fallback_image

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా || vache vache nalla mabbullara lyrics

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలేన్నో మాకున్నై
గుందేలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పాడేస్తార

చరణం 1
పిల్ల పాపల వాన
బుల్లి పడవల వాన
చదువు బాధలే తీర్చి సెలవులిచ్చిన వాన
గాలి వాన కబడ్డి
వేడి వేడి పకోడి
ఈడు జోడు ది ది ఢి
తోడుండాలి ఓ లేడి
ఇంద్ర ధనస్సులో తళుకు మనె యెన్ని రంగులో
ఇంటి సొగసులే తడిసినవి నీటి కొంగులో
శ్రావన మాసాల జల తరంగం
జీవన రాగాల కిది ఓ మృదంగం

చరణం 2
కోరి వచ్చినా ఈ వాన
గోరు వెచ్చనయి నాలోన
ముగ్గుల సిగ్గు ముసిరేస్తే
ముద్దు లాటిదే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు
తడిసే తడిసే పరువాలు
గాలి వానలా పందిళ్ళు
కౌగిలింతలా పెళ్ళిళ్ళు
నెమలి ఈకలో ఉలికి పడే యెవరి కన్నుల్లో
చినుకు చాటునా చిటికేలతో యెదురు చూపులో
నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం

error: Content is protected !!