విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం || vidhata talapuna prabhavinchinadi anaadi jeevana vedam lyrics

ante_enti_fallback_image

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం || vidhata talapuna prabhavinchinadi anaadi jeevana vedam lyrics

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
ఓం! ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం
ఓం! కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
సరస స్వర సుర ఝరి గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిల కిల స్వరముల స్వరజతి దొరకని జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా

విరించినై||

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసములే

విరించినై||

నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరస స్వర సుర ఝరి గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం

error: Content is protected !!