ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ || yevaro ravali anu aasa nedu theerali lyrics

ante_enti_fallback_image

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ || yevaro ravali anu aasa nedu theerali lyrics

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ..
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ..

కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళీ..
ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ..

స్మౄతులే బ్రతుకై గడిపా..ప్రతి పూటా నిన్నగా..
సుడిలో పడవై తిరిగా..నిను చేరే ముందుగా..
వెతికే గుండే లోగిలో వెలిగా చైత్ర పాడ్యమిలా..
మెరిసే కంటి పాపలలో వెలిసా నిత్య పౌర్ణమిలా..
ఎందుకిలా అల్లినదో వన్నెల వెన్నెల కాంతి వలా..

ఎవరో .. ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ..
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ..

error: Content is protected !!