ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు || idigidigo naa ramudu edane koluvundinadu lyrics

ante_enti_fallback_image

ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు || idigidigo naa ramudu edane koluvundinadu lyrics

ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు

ఇదె సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె

ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే

మాయల బంగారు లేడి మాయని గురుతులివే

పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగాసీతమ్మ వాడిన పసుపూ కుంకుమ రాళ్ళివే

దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే

అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే

ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమీ
మరి నా రామునికీడ నిలువ నీడ లేదిదేమీ
నిలువ నీడ లేదిదేమీ !

error: Content is protected !!