ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో || eduta nilichindi chudu.. jalataru vennelemo lyrics

ante_enti_fallback_image

ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో || eduta nilichindi chudu.. jalataru vennelemo lyrics

ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా..ఆ..

ఎదుట నిలిచింది చూ..డు..

నిజం లాంటి ఈ స్వప్నం .. ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం .. ఎలా తట్టుకోవాలీ
అవునో..కాదో..అడగకంది నా మౌనం
చెలివో..శిలవో..తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే..జన్మ ఖైదులా..ఆ….

ఎదుట నిలిచింది చూడు..

నిన్నే చేరుకోలేక..ఎటెళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా..విసుక్కుంది నా కేకా
నీదో..కాదో..రాసున్న చిరునామా
ఉందో..లేదో..ఆ చోట నా ప్రేమా

వరంలాంటి శాపమేదో..సొంతమైందిలా..ఆ….

ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా..ఆ….

ఎదుట నిలిచింది చూడు..

error: Content is protected !!