Yemunnave pilla song lyrics in telugu

Pinterest
X
WhatsApp

లేత లేగ దూడపిల్ల తాగే
పొదుగులోని పాల రంగు నువ్వే

పచ్చపైరు వోని ఒంటికేసుకొని ఏమున్నావే
నింగి సాటున్న సినుకు నువ్వే
సూటిగా దూకేసి తాకినవే
ఎలిసిపోని వాన జల్లు లాగా ఎమున్నావే

ఓ… మల్లెపూలను కుళ్లుకునేలా
ఎమున్నావే పిల్ల… ఎమున్నావే
తేనెటీగలన్నీ సుట్టుముట్టెలా
ఎమున్నావే పిల్ల… ఎమున్నావే

సూరీడు సూడు పొద్దు దాటినా నిన్ను సుసి పోలేడే
సీకటి ధాటినా సెందురుడు… దాగే లాగా ఎమున్నావే

ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
అంధంతో బంధించావే
ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
సూపుల్తో సంపేశావే
ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
మాటల్లో ముంచేశావే
ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

ఓ… తోలి సీనుకు సేరి
ఈ నేల గాలి గుప్పించే… మట్టి సువాసన నీది
పొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే… పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది

నువ్వు నడిసే నడకల్లో …
నది పొంగుల హంగుంది
లేత నడుము మడతల్లో…
ఈ మాయల మనసుంది
వాలే రెండు కన్నుల్లో…
బోలెడంత సిగ్గు దాగుంది
వాలుజడ గుత్తుల్లో…
ఈ భూగోళం మొత్తంముంది

హే… ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
అంధంతో బంధించావే
ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
సూపుల్తో సంపేశావే
ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
మాటల్లో ముంచేశావే
ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

ఓ… ఎగిరేటి సిలకా
గోరింకా వంక
ఓరా కన్నేసి సూసింది సూడు
తరిగేటి సోగసా
కాదేమో బహుశా
ఐన నవ్వేసి వచ్చింది నేడు

కారుమబ్బు సీకట్లో
నీ వెన్నెల నవ్వుంది
ఆరుబయట వాకిట్లో
ఆ సుక్కల ముగ్గుండి
జంట అయ్యే దారుల్లో
నీ సిగ్గుల అడ్డుంది
వెంటవచ్చే అడుగుల్లో
జన్మ జన్మల తోడుంది

హే… ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
అంధంతో బంధించావే
ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
సూపుల్తో సంపేశావే
ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
మాటల్లో ముంచేశావే
ఏమున్నావే పిల్ల… ఏమున్నావే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!