పూసింది పూసింది పున్నాగ || Pusindi pusindi punnaga Lyrics

ante_enti_fallback_image

పూసింది పూసింది పున్నాగ || Pusindi pusindi punnaga Lyrics

పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ….. జతులాడ……..
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే…… మదిపాడే……
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరిరాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూలతోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసే…. విరబూసే……
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై (2)
ఆడ.. జతులాడ…
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ

error: Content is protected !!