అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజు || Aho oka manasuki nede puttina roju Lyrics

ante_enti_fallback_image

అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజు || Aho oka manasuki nede puttina roju Lyrics

అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు

ఇదే ఇదే కుహూ స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు ||ఆ||

1|| మాట పలుకు తెలియనిడి మాటున ఉండే మూగ మది
కమ్మని తలపుల కావ్యమయె కవితలు రాసే మౌనమది
రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమిది
శ్రుతిలయలేరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమిదీ
ఋతువుల రంగులు మార్చెది కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాట గ మలిచెది మనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది
తనే కదా వారధి క్షణాలకే సారధి మనస్సనెది ||అహూ


2|| చూపులకెన్నడు దొరకనిది రంగూ రూపూ లెని మది
రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినదీ ఈ……
మెత్తని చెలిమిని పొందినది వెన్నెల థరగలనిన్డు మది
కాటుక చీకటి రాతిరికి బాటను చూపెనెస్తమదీ
చేతికి అందని జాబిలీలా కాంతులు పంచే మణి దీపం
కొమ్మల చాటున కొయిలల కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి అమృత వర్శిణి అనిపించే
అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధిమనస్శనెది ||అహూ

error: Content is protected !!