నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా || nuvvakkadunte nenikkadunte pranam vila vila lyrics

ante_enti_fallback_image

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా || nuvvakkadunte nenikkadunte pranam vila vila lyrics

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా..విల విలా..విల విలా..
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా..గల గలా..గల గలా..
ఎందుకో ఏకాంతవేళా..చెంతకే రానందీ వేళ..
గాలిలో రాగాలమాలా..జంటగా తోడుంది నీలా..
నీ ఊహలో కలా..ఊగింది ఊయలా..
ఆకాశవాణిలా పాడింది కోయిలా..

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా..విల విలా..విల విలా..
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా..గల గలా..గల గలా..

సరిగమలే వర్ణాలుగా..కలగలిసేనా..కంటి పరదా నీ బొమ్మలా..కళలొలికేనా..
వర్ణమై వచ్చానా..వర్ణనై పాడానా..జాణ తెలుగులా..జాణ వెలుగులా..
వెన్నెలై గిచ్చానా..వెకువే తెచ్చానా..పాల మడుగులా..పూల జిలుగులా..
అన్ని పోలికలు విన్న..వేడుకలో ఉన్నా..నువ్వేమన్నా నీ మాటలో నన్నే చూస్తున్నా..

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా..విల విలా..విల విలా..
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా..గల గలా..గల గలా..

ప్రతి ఉదయం నీల నవ్వే సొగసుల జోలా..ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాలా..
అంతగా నచ్చానా..ఆశలే పెంచానా..గొంతు కలపనా..గుండె తడపనా..
నిన్నలా వచ్చానా..రేపుగా మారానా..ప్రేమ తరపునా..గీత చెరపనా..
ఎంత దూరాన నీవున్నా..నీతోనే నే లేనా..నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా..

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా..విల విలా..విల విలా..
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా..గల గలా..గల గలా..
ఎందుకో ఏకాంతవేళా..చెంతకే రానందీ వేళ..
గాలిలో రాగాలమాలా..జంటగా తోడుంది నీలా..
నీ ఊహలో కలా..ఊగింది ఊయలా..
ఆకాశవాణిలా పాడింది కోయిలా..

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా..
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా..

error: Content is protected !!