ఏదిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా || Edikkuna nuvvunna egirosta pavurama Lyrics

Pinterest
X
WhatsApp

ఏదిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా

నా రెక్కల కలనాపే బలమేదీ లేదు సుమా..!

పొంగే అలవొస్తే తలవంచాలి

వయసూ అలలాంటిదేగా

ప్రాయం వెనకాలే పయనించాలి

ప్రణయం వెన్నాడి రాగా ||ఏదిక్కున||

చరణం 1

గిరులే వణికే జలపాతంలో జోరు

నీలో చూశా బంగారూ

ఎదిగే సొగసై ఎదురొస్తే పదహారు

అలలై ఎగసే ఎదహోరు

వర్ణాల విల్లులో ఒక్కోరంగు తీసి

వయ్యారి ఒంటికి పూసిందెవరు..?

చరణం 2

మధువే తొణికే అధరం మధుకలసం

మౌనం కూడా ప్రియమంత్రం

అపుడూ అపుడూ తెగి పడనీ ఒక ముత్యం

వెనకే తిరిగా ప్రతినిత్యం

ఆ చిలక పలుకులే అలా అలా ఏరి

నాలోని తలపులే స్వరాలు చేసి

నీకే ఇస్తా సఖియా కవితలు కూర్చి… ||ఏదిక్కున||

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!