ఇన్నాళ్ళకు గుర్తొచాన వాన || innallaku gurtochana van lyrics

ante_enti_fallback_image

ఇన్నాళ్ళకు గుర్తొచాన వాన || innallaku gurtochana van lyrics

సినుకు రవ్వలో సినుకు రవ్వలో సిన్నదాని సంబరాన
సిలిపి నవ్వులొ
పంచ వన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
సినుకు రవ్వలో సినుకు రవ్వలో సిన్నదాని సంబరాన ..

ఇన్నాళ్ళకు గుర్తొచాన వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావె పైన
చుట్టంలా వస్తావె చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

చరణం 1
ముద్దులొలికే ముక్కు పుడకై ఉండిపోవె ముత్యపు చినుక
చెవులకు సన్న జూకాల్లాగ చేరుకోవె జిలుగుల చుక్క
చేతికి రంగుల గాజుల్లాగ
కాలికి మువ్వల పట్టిలాగ
మెడలో పచ్చల పతకంలాగ
వదలకు నిగ నిగ నిగలను తొడిగేల

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

చరణం 2
చిన్న నాటి తాలియంలా నిన్ను నాలో దాచుకోనా
కన్నీటి సోయగంల నన్ను నీలా పొల్చుకోనా
పెదవులు పాడే కిల కిల లోనా
పదములు ఆడే కథకలి లొన
కనులను తడిపే కలతల లొన
నా అణువణువున నువు కనిపించేలా..

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

error: Content is protected !!