కాబోయే శ్రీవారికీ… ప్రేమతో.. || Kaboye srivariki… Prematho.. Lyrics

ante_enti_fallback_image

కాబోయే శ్రీవారికీ… ప్రేమతో.. || Kaboye srivariki… Prematho.. Lyrics

కాబోయే శ్రీవారికీ… ప్రేమతో..

కాబోయే శ్రీవారికీ… ప్రేమతో..
రాసి పంపుతున్న… ప్రియ రాగాల ఈ లేఖ..

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే

నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది ఏ నాడని… అంటూ..

||మా పెరటి||

Yes you are my dream girl నా కలల రాణి నా కళ్ళ ముందుంది
అద్భుతం.. అవును అద్భుతం.. మన కలయిక అద్భుతం..
ఈ కలయిక ఇలాగే వుండాలి … promise…promise…

నిన్ను చూడందే పదే పదే పడే యాతన
తోట పూలన్ని కనీ వినీ పడేను వేదనా
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా
చూసే కన్నుల ఆరాటం..రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి.. నీ రాక కొసం
వేచి వున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ… అంటూ…

||మా పెరటి||

పెళ్ళి చూపుల్లొ నిలేసినా కధేమిటొ మరీ
ఙ్నాపకాలల్లొ చలేసిన జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లో ప్రతీ క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ
తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు
యెదటో నుదుటో ఎచటో మజిలీ.. నీ మీద ప్రాణం
నిలుపుకున్న మా మన విని నిను దయచేయ మనీ… అంటూ…

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
సపమ నిప గాగా మా రీ సాస నిస రిస రిపగా
సపమ నిప గాగా మా రీ సాస నిస రిస రిమగా

error: Content is protected !!